టోక్యో : ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు ఈసారి 5వేల పతకాలు దక్కనున్నా యి. ఈ పతకాలన్నింటినీ జపాన్ ప్రభుత్వం నిరుపయోగ ఎలక్ట్రానిక్ పరికాలు(పాత ఫోన్లు) నుంచి తయారు చేసింది. జపాన్ పౌరులు విరాళంగా ఇచ్చిన 78టన్నులకు పైగా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులనుంచి 32కిలోల బంగారం, 3,500కిలోల వెండి, 2,200 కిలోల కంచును సేకరించింది. విజేతలకు అందజేసే పతకాలకు ఒకవైపు గాడ్ ఆఫ్ విక్టరీ, ఇటాలియన్ కళాకారుడు గోస్సోయిలి 1928లో గీసిన బొమ్మ, విజయ పుష్పగుచ్చం ఉన్నాయి. మరోవైపు టోక్యో 2020 ఒలింపిక్స్ చిహ్నం కలిగి ఉంది.










