Jan 27,2023 21:03

మాట్లాడుతున్న ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : లాస్ట్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌(ఎల్‌ఎంటిఎస్‌)ను ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్‌ ఫోన్‌ ప్రజల జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్లలో విలువైన సమాచారాన్ని దాచుకుంటున్నారన్నారు. ప్రజలు అధిక ధరలు పెట్టి స్మార్ట్‌ ఫోన్లు పోగొట్టుకోవడం తరచుగా చూస్తున్నామని చెప్పారు. దీన్ని అరికట్టే విధంగా సెల్‌ఫోన్‌ పోయిన వ్యక్తులు తమ విలువైన సమాచారాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గమనించి లాస్ట్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించామన్నారు. జిల్లాలోని ప్రజలు ఎవరైనా తమ మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా జిల్లా పోలీసులు రూపొందించిన వెబ్‌సైట్‌ ష్ట్ర్‌్‌జూర://టశీతీఎర.స్త్రశ్రీవ/జజఔస్త్రఖస్త్రసAుజుbరవర4దీ9 లేదా 8688830012 మొబైల్‌ నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా హారు అని మెసేజ్‌ చేయాలని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా లాస్ట్‌ మొబైల్‌ ట్రేసింగ్‌ టీం సభ్యులు ఫిర్యాదు చేసిన వ్యక్తికి మొబైల్‌ వివరాలు సేకరించి పోయిన మొబైల్‌ ఫోను వెతికి అప్పగిస్తారని సూచించారు. ప్రజల అవసరార్థం రూపొందించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీన్ని సరదాగా లేదా ఆకతాయితంగా ఫిర్యాదు పంపినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.