Sep 06,2022 17:55

ap tourisum

ఎక్స్‌ లెన్స్‌ అవార్డులకు దరఖాస్తులు
జిల్లా పర్యాటక అధికారి ఫణి దూర్జటి
ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కష్ణా)
పర్యాటక శాఖ ఎక్సలెన్స్‌ అవార్డుల కోసం ఈ నెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ, సాంస్కతికశాఖ అధికారి ఫణి దూర్జటి. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక శాఖ రాష్ట్ర స్థాయి ఎక్స్‌ లెన్స్‌ అవార్డులు అందజేస్తుందని తెలిపారు. పర్యాటక శాఖ అనుబంధ విభాగాల్లో ఉత్తమ హోటల్‌, ఉత్తమ వంటకాలు, ఎకోటూరిజం, బెస్ట్‌ ఎయిర్‌ పోర్టు, రూరల్‌ టూరిజం, స్టార్‌ హోటల్‌ 5,4,3, బడ్జెట్‌ హోటల్‌, ట్రావెల్‌ ఏజెంట్‌, టూరిస్ట్‌ గైడ్‌ ఇలా 40 రకాల అవార్డులు ప్రధానం చేస్తామని వివరించారు. ఆసక్తి గల వారు ఈనెల 10న సాయంత్రం ఐదోతేదీలోగా తమ దరఖాస్తులను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ, స్టాలిన్‌ కార్పొరేట్‌ బిల్డింగ్‌ 5వ అంతస్తు, ఆటోనగర్‌, విజయవాడ-520007 చిరునామాకు పంపించాలని కోరారు. షషష.aజ్‌ూశీబతీఱరఱఎ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్కు ఆన్లైన్‌ ద్వారా గాని లేదా పైన తెలిపిన అడ్రస్సుకు హార్డ్‌ కాపీ దరఖాస్తు పంపించాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు పి.వి.దీపక్‌, మేనేజర్‌, సెల్‌: 91211 44099లో సంప్రదించాలని కోరారు.