Dec 17,2022 21:23

అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌కు బొకే అందజేస్తున్న ఎఆర్‌ డీఎస్పీ జెడ్‌.విజరుకుమార్‌

           ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌   శ్రీ సత్యసాయి జిల్లా ఎఆర్‌ డీఎస్పీగా జెడ్‌.విజరుకుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఎఆర్‌ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విజరుకుమార్‌ ఇక్కడికి బదిలీ చేయడంతో స్థానిక ఎఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అడ్మిన్‌ ఆర్‌ఐ టైటస్‌ ఎన్టీఆర్‌ నారాయణ, వెల్ఫేర్‌ ఆర్‌ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణప్రసాద్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.