Oct 19,2022 22:56

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
రైతుల పొలాలకు వెళ్ళే డొంక రోడ్డు నుండి లైట్‌ వెయిట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీ వాహనాలు వెళ్ళటం వలన రోడ్డు ధ్వంసమైందని, ఫ్యాక్టరీ యాజమాన్యం తక్షణమే ఆ రోడ్డును నిర్మించాలని సిపిఎం నాయకులు కాకనబోయిన లింగారావు, కోటా కష్ణ, దంతాల వెంకటేశ్వర్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట నుండి రామచంద్రుని పేట వెళ్లే రోడ్డులో గల బొండాడ లైట్‌ వెయిట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీ కి వెళ్ళే డొంక రోడ్డును బుధవారం రైతులతో కలిసి సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిక్స్‌ ఇటుకలతో అధిక లోడుతో లారీలు తిరగటం వల్ల రోడ్డు ధ్వంసం అయిందని, దీంతో వర్షాలు వస్తే రోడ్డు బురదతో చిత్తడిగా ఉండి రైతులు పంట పొలాలకి వెళ్ళుటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాబట్టి తక్షణమే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి రైతులు ఇబ్బందులు పడకుండా రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మర్తి శ్రీను, మార్తీ ఉపేంద్ర, కకనబోయిన రాము, శీలం శేషగిరి, చల్లా శ్రీను తదితర రైతులు పాల్గొన్నారు.