Mar 19,2023 22:46

వైద్యాధికారికి వినతి ఇస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల వైద్యాధికారులకు ధర్నాకు సంబందించిన నోటీసులను అందజేశారు. ఈ సందర్బంగా నరసింహప్ప మాట్లాడుతు ఆశ వర్కర్లకు సంబంధం లేని పనులను చేయిస్తున్నారన్నారు. రాజకీయ, అధికారుల వేదింపులు ఎక్కువ అయ్యాయన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అర్హులను ఎఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు జ్యోతమ్మ, ప్రశాంతమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.