- పాలకులకు సమస్యలు పట్టడంలేదని ప్రజల ఆవేదన
- ఇంటింటికీ 'జనం కోసం సిపిఎం'
ప్రజాశక్తి - వన్‌టౌన్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, నిత్యావసర ధరలు పెరిగిపోవటంతో జీేవనం దుర్భరంగా మారిందని సామాన్య, పేద ప్రజలు వాపోయారు. పాలకులకు సమస్యలు పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో 51వ డివిజన్‌లోని తేలప్రోలు రాజా హైస్కూల్ పక్కన గల పీతాని అప్పలస్వామి రోడ్డు, కొండ ప్రాంతంలో 'జనం కోసం సిపిఎం' కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలో నివాసముంటున్న ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ చేయలేదని, చెత్త పన్ను కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, పింఛను సొమ్ము నుంచి చెత్త పన్ను మినహాయిస్తున్నారని, కొత్త పింఛన్లు మంజూరు చేసేలా చూడాలని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.సూరిబాబు, ఇస్మాయిల్, రాంబాబు, సూర్యనారాయణ, సీతయ్య, ఎం.పైడిశెట్టి, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 50వ డివిజన్‌లో సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు పాల్గొని స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వివిధ కారణాలతో అమ్మఒడి పథకం రద్దు చేశారని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కె.లక్ష్మణ్. జి.అప్పన్న, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ: సింగ్‌నగర్ 63వ డివిజన్ సుందరయ్యనగర్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు నేతృత్వంలో ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు. ధరలు పెరిగాయని, రాబడి తగ్గిందని, కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని, వివిధ కారణాలతో అమ్మఒడి, పింఛన్లు నిలుపుదల చేస్తున్నారని ప్రజలు వాపోయారు. చెత్త పన్ను చెల్లించకపోతే రేషన్ కార్డు తొలగిస్తామని బెదిరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రాంబాబు, అమ్ములు, మున్నా, పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ: గవర్నర్‌పేటలోని ఆకులవారి వీధిలో దేవాదాయశాఖకు సంబంధించిన భూమిలో గత 50 ఏళ్ల నుంచి నివాసముంటున్న 20 కుటుంబాల వారికి లీజు అగ్రిమెంట్ ఇవ్వాలని కోరుతూ జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా అక్కడకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ బాధితులను కలుపుకొని ఎండోమెంట్ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇదే విషయాన్ని ఇఒ హైమావతికి నాయకులు వివరించారు. ఈ సందర్భంగా కాశీనాధ్ మాట్లాడుతూ ఎండోమెంట్ భూమిలో ఉంటున్న 20 కుటుంబాల వారికి గత కొంత కాలం నుంచి లీజు ఎగ్రిమెంట్ ఇవ్వకుండా, ఇంటి అద్దె రసీదులు ఇస్తున్నారని అన్నారు. దీని వల్ల ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లు ఏమవుతాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. లీజు ఎగ్రిమెంట్ ప్రకారం అద్దెలు వసూలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులు వై సుబ్బారావు, బి లక్ష్మణరావు, కె వెంకటేశ్వరరెడ్డి, ఎల్ ఓంకార్, కోరాడ రమణ, తాడి రమణ, ఎ లక్ష్మణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణలంక 22వ డివిజన్‌లో తూర్పు సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల చిన్నారావు సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజ్జి అప్పారావు, ఉపేంద్ర, గోక సూర్యనారాయణ, ఎ శివ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధి హామీ డబ్బులు రెండు నెలల నుంచి ఇవ్వడంలేదని, ఇళ్ల స్థలాలు రాలేదని, డ్రైనేజీ సరిగ్గాలేదని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బి.రాము, గ్రామ కార్యదర్శి చిన్న వెంకటి, వెంకయ్య వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఎ.కొండూరు: మండలంలోని చీమలపాడులో ఎస్‌సి, బిసి కాలనీల్లో కరపత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరావు, పి.ఆనందరావు, యోహాను, యస్.కె .మరియమ్మ, యం.స్వరాజ్యం, యస్ ఆనందరావు పాల్గొన్నారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: మండల కేంద్రంలోని యాదవ్ బజార్ జరిగిన కార్యక్రమంలో ధరల పెరుగుదలపై ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దాదా నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు గజ్జి పెద్దిరాజు, ధనమ్మ, శేషమ్మ, కొండలు, పాల్గొన్నారు. ప్రజాశక్తి-చందర్లపాడు: చందర్లపాడులోని ఎస్‌సి కాలనీలోని 8, 9 వార్డుల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. మంచినీరు, డ్రైనేజీ, ఉపాధి హామీ బకాయిల సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమెలు సైదులు, మండల నాయకులు ఎస్.కె హస్సాన్, వేల్పుల ఏసోబు, సందిపోగు లింగయ్య, ఉద్దండు సాహెబ్, హుస్సేన్ సాహెబ్, బోణం శివమ్మ, కనగాల సీతారామ్మ, తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విస్సన్నపేట: చండ్రుపట్ల గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, నరసింహారావు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల రైతు బజార్ వద్ద జనం కోసం సిపిఎం కార్యక్రమం నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుంచి నివాస స్థలాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వాలు మారుతున్నా మా బతుకులు మారలేదని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట కళ్యాణ్, జిల్లా నాయకులు ఎన్.నాగేశ్వరరావు, పటాన్ సైదా, నాగుల్ మీరా, శిరోమణి, హుస్సేన్ బి.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: వామకుంట్ల గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని, ఇళ్లకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సాంబారు వెంకటేశ్వర్లు, నాయకులు మర్సకట్ల ప్రభాకరరావు, ఇసుకుల వెంకటేశ్వరరావు, వెలుపుల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.










