Jul 13,2021 12:02

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏండ్లలో ఇదే తొలిసారి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఏరియాలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిముషాల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఢిల్లీకి సమీపంలోని ఎన్సీఆర్‌, గోహనా, సోనిపట్‌, రోహతక్‌, కేక్రా ఏరియాల్లోనూ వర్షం కురిసింది. అండర్‌ పాస్‌ల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఫ్లై ఓవర్‌ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది.