ప్రజాశక్తి - పెనుమంట్ర
సార్వా ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు నరసాపురం ఆర్‌డిఒ ఎంఎ అంబరీష్ సూచించారు. మంగళవారం ఆలమూరు రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు, మౌలిక సదుపాయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబరీష్ మాట్లాడుతూ విఎఎలు సేకరించిన రైతుల వివరాలు, ఏ రైస్ మిల్లులు రవాణా చేసే వాహనాల రికార్డు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ఏలియమ్మ, ఆర్‌ఐ అప్పారావు, విఆర్‌ఒ శ్రీనివాస్ పాల్గొన్నారు.