Apr 12,2023 14:29

న్యూఢిల్లీ  :   దక్షిణ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన యాజమాన్యం విద్యార్థులను పాఠశాల నుండి ఖాళీ చేయించింది. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం... సాదిక్‌ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్యూల్‌కి ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10.49 గంటలకు ఓ ఇమెయిల్‌ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుమిగూడిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి. పిల్లలను స్కూల్‌ నుండి ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా మెసేజ్‌ వచ్చిందని విద్యార్థి తండ్రి ఒకరు తెలిపారు.  అయితే స్కూల్‌ యాజమాన్యానికి బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లోనూ ఇలాగే ఓ ఇమెయిల్‌ వచ్చిందని అన్నారు. వెంటనే డాగ్‌ స్క్వాడ్‌తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పారు.