హిందూపురం : ద్విచక్ర వాహానాల దొంగల ముఠాతో పాటు నకిలీ ఆర్‌సిలు సిద్దం చేయాడానికి ఉపయోగించే కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు నకిలీ ఆర్‌సిలను హిందూపురం పోలీసులు స్వాదీనం చేసుకుని 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టూటౌన్ స్టేషన్‌లో హిందూపురం ఇన్‌చార్జ్ డిఎస్పీ యశ్వంత్, సిఐ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అరెస్టు వివరాలను వెల్లడించారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా దొంగలించబడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. దీనిపై టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం పట్టణంలోని సిపిఐ కాలనీ సమీపంలోని డంపిగ్ యార్డు వద్ద ఉన్నా అటవీ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న పులమితి అల్లాబకాష్, సయ్యద్ ఆసీఫ్, జబివుల్లా, మహమ్మద్ ఆదీల్ ఖాన్, సత్తార్ ఖాన్, నూర్ మహమ్మద్, అజీజ్ ఖాన్, షేక్ ముభారక్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారు. వీరితో పాటు 36 ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్, ప్రింటర్, కొన్ని నకిలీ ఆర్‌సిలను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించిన సిఐ వెంకటేశ్వర్లు, సిబ్బందికి డిఎస్‌పి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.










