దుస్తులు పంపీణి చేస్తున్న సంస్థ నిర్వాహకులు
ప్రజాశక్తి -కందుకూరు :పేదవారి సహయార్ధం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పట్టణంలో సోమవారం ప్రతి ఇంట్లో దుస్తులు, పాతవి కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారికి అందిం చారు. సంస్థ నిర్వాహకులు అందరూ కలిసి ఆ దుస్తులను ఊరిబయట నివాసం ఉండే ప్రాంతాల్లో వద్ధులకు, పిల్లలకు బట్టల అవసరం ఉందో తెలుసుకొని వారికి అందించారు. వాటితో పాటు భోజనాల ప్యాకెట్లు అందజేశారు. ప్రెసిడెంట్ సాజిద్, సెక్రటరీ షంషేర్, ట్రజరర్ హఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, షంషఉద్దీన్ పాల్గొన్నారు.










