Oct 04,2022 22:30

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: దేవి శరన్నవరాత్రులు సందర్భంగా పట్టణంలోని శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగని ఉదయభాను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.