ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్ చక్రవర్తి కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.










