ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికగా ఆలయ ప్రధానార్చకులు వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి స్వప్నాభిషేకం
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో ఈనెల 11 నుండి 13వ తేదీ వరకూ చేపట్టిన పవిత్రోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ అమ్మవారికి స్వప్నాభిషేకం, అనంతరం ప్రాతః కాలార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం గం.9.00 ల నుండి భక్తులకు అమ్మవారి దర్శనంకు అనుమతించారు. వైదిక కార్యక్రమాలలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ సమక్షంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండ పారాధన, అగ్నిప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు.










