Sep 30,2022 22:14

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ 

ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ ఐదవ రోజైన శుక్రవారం శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు శుక్రవారం దుర్గమ్మ దర్శనం కోసం రూ. 500ల టిక్కెట్లు కొనుగోలు చేసి దేవాలయానికి వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన జి. శ్రీరామ చంద్రమూర్తి (57) శుక్రవారం ఉదయం 11.20 గంటల సమయంలో అమ్మవారి దర్శనం చేసుకునే సందర్భంలో అమ్మవారి గర్భగుడి సమీపంలో అకస్మాత్తుగా కుప్పకూలి పోయారు. దీంతో కొండపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది డాక్టర్‌ కార్తీక్‌ వెంటనే స్పందించి కుప్పకూలిపోయిన జి. శ్రీరామ చంద్రమూర్తిని పరీక్షించి వెంటనే బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఇచ్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్‌)కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరిం చారు. జి. శ్రీరామచంద్రమూర్తి హృదయ సంబంధిత వ్యాధి, డయాబెటిక్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు బంధువులు తెలిపారు.