ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. శ్రావణ మాసం, ఆదివారం కావటంతో పలు ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు.భక్తుల రద్దీ దష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవా వరణార్చన, చండీహాోమం, శాంతికళ్యాణం మరియు ఇతర సేవల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఏ.వి. రవీంద్రబాబు దంపతులు ఆదివారం విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.










