Jul 04,2022 23:37

ప్రజాశక్తి-వన్‌టౌన్‌
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గగుడి హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మొత్తం 45 హుండీలకు 41 హుండీలను లెక్కించగా 12 రోజులకు నగదు రూ.2,35,14,884, బంగారం 794 గ్రాములు, వెండి 7.655 కిలోలు సమకూరాయి. ఈ-హుండీ ఆన్‌లైన్‌ ద్వారా రూ.51,731 చేకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు. దుర్గమ్మకు సోమవారం జుబ్లీహిల్స్‌, హైదరాబాద్‌కు చెందిన ఎ.మురళీకష్ణ కుటుంబ సభ్యులు సుమారు 35.8 గ్రాములు బరువు కలిగిన బంగారు నల్లపూసల చైన్‌, సూత్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబని కలిసి దేవస్థానానికి విరాళంగా అందజేశారు.