Oct 14,2022 23:08

ప్రజాశక్తి - వన్‌టౌన్‌

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీ లాద్రి శ్రీ అమ్మవారి దసరా శరన్నవ రాత్రులు మహాోత్సవాలు అనం తరం శుక్రవారం మహా మండపం ఆరవ అంతస్తులో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అయితే నాలుగు రోజులుగా హుండీల లెక్కింపును దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులకు గాను హుండీల ద్వారా దుర్గమ్మకు నగదు రూపంలో మొత్తం రూ. 9,11,33,985లు, బంగారం కేజీ 416 గ్రాములు, వెండి 29 కేజీల 475 గ్రాములు ఆదాయం భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ ఇఓ భ్రమరాంబ శుక్రవారం ఓ ప్రటకనలో తెలిపారు. నాల్గవ రోజు ఒక్కరోజు హుండీల లెక్కింపు ద్వారా నగదు రూ. 66,58,198లు, బంగారం: 39 గ్రాములు, వెండి: 500 గ్రాములు భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ. 77,382లు, విదేశీ కరెన్సీ (యుఎస్‌) డాలర్స్‌ 2393 హుండీల ద్వారా సమర్పించారు. ఈ సందర్భంగా ఇఓ హుండీల లెక్కింపును దగ్గరుండి పర్యవేక్షించారు. నాలుగు రోజుల హుండీల లెక్కింపు ద్వారా మొత్తం మీద తొమ్మిది కోట్లు పైచిలుకు అమ్మవారికి ఆదాయం వచ్చిందని తెలిపారు.