ప్రజాశక్తి-నందిగామ
విద్యార్ధులు, యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నందిగామ ఏసీపీ జి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు, పోస్టర్‌ను జి.నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలను నిరోధించడానికి ప్రత్యేక కేంద్రీకరణతో పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారు తున్న యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుల కార్యక్రమాలను నిర్వహించడం మంచి పరిణామమన్నారు. డివైఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నందిగామ డివైఎఫ్‌ఐ టౌన్ కార్యదర్శి జక్కులురి రవి, అధ్యక్షులు షేక్.జాన్ సైదా, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి జి.గోపి నాయక్, సిఐటియు మండల కార్యదర్శి కటారపు గోపాల్, రాజేష్,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










