ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని సిఎం లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు అవుదామని కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్‌పి రాహుల్ దేవ్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో తొలిసారి జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చైర్మన్ గా, ఎస్‌పి కన్వీనర్ గా కమిటీ సభ్యులుగా పెనుకొండ సబ్ కలెక్టర్, ఆర్‌డిఒలు, విద్యాశాఖ అధికారి, డి ఎం హెచ్ ఓ లు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి రామకృష్ణ ప్రసాద్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో భాగ్యరేఖ, డి ఎం హెచ్ ఓ ఎస్ వి కష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, కలెక్టరేట్ తహశీల్దార్ అనుపమ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










