టీజర్ విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి కదిరిటౌన్ : దోస్తాన్ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సినిమా టీజర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి పట్టణం బేర్ పల్లి కాలనీ చెందిన సూర్యనారాయణ దోస్తాన్ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి సినిమాను ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు అభినందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆనందింపజేసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ టెంపుల్ డైరెక్టర్ సంజరు బాబు, జనార్ధన తదితరులు పాల్గొన్నారు.










