Oct 15,2022 15:45

ప్రజాశక్తి-వీరులపాడు : మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షాలకు రైతులు సాగు చేస్తున్న పంట పొలాలు వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో భారీగా నష్టమాటిలింది. 15 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు మండలంలో పత్తి 9900 ఇతరులు సాగు చేస్తున్నారు. మిర్చి 1500 ఎకరాలు రైతులు వివిధ గ్రామాల్లో పంటలను సాగు చేస్తున్నారు.  నెల రోజులు కిందట రైతులు సాగు చేస్తున్న పంటలు ఆశాజనకంగా ఉన్న పైర్లపై అధిక వర్షాలు ప్రభావం పడింది. పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ నీరు బయటకు రావటానికి సమయానికి మళ్ళీ వర్షం పడుతుంది. ఫలితంగా పొలాల్లో తేమ తగ్గడం లేదు తడి శాతం ఎక్కువై మొక్కలు ఒడిలి పోతున్నాయి. క్రమంగా ఎండిపోతున్నాయి. పిందే కాయ దశలో ఉన్న పైర్లు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. పూత పిండా కాయ అధిక వర్షాలకు రాలిపోతున్నాయి. కొన్ని కాయలు నల్లబడి బూజు పట్టి ఎందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం పత్తి మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశారు కౌలు రైతులు ఎకరానికి 30000 కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారు రైతులు కౌలు రైతులు ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు పత్తిపై తెల్ల దోమ పచ్చి దోమ నల్లి శనగపప్పు పురుగులాసించాయి వాటి నివారణకు మందులు పిచికారి చేస్తున్నారు. వర్షాలు తగితే   రక్షణ చర్యలు చేపట్టి పంటలు కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు వర్షాలు తగ్గకపోవడంతో వాతావరణ సహకరించకపోవడం లేదు పేర్లను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుల ఆశలపై వర్షపు నీళ్లు చెల్లింది ఇప్పటికే కాపు పూర్తిగా పోయింది మళ్లీ పూత పిందె వస్తే కానీ పంటలు లేని పరిస్థితి పెట్టుబడి చేతికి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.