ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు
దళితులపై దాడులు అరికట్టాలి : టిడిపి
ప్రజాశక్తి-కావలి : దళితులపై జరుగుతున్న దాడులను, వారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎస్‌సి సంఘం నాయకులతో చర్చించారు. ఎస్‌సిలఅంతం వైసిపి ప్రభుత్వ ధ్యేయంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇటువంటి కార్యకలాపాలను ఖండించే విధంగా టిడిపి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయనతోపాటు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, పార్లమెంట్ ఎస్‌సిసెల్ అధ్యక్షులు కాకి ప్రసాద్, జిల్లా ఎస్‌సిసెల్ అధికార ప్రతినిధి అంగలూరి చిన కొండయ్య, పార్టీ ముఖ్య నాయకులు దువ్వూరు రమేష్ చంద్ర, యడవల్లి మురళి, పేరం రవిబాబు తదితరులు పాల్గొన్నారు.










