మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్
దళితులపై దాడులను నిరసిస్తూ
8న జక్కావెంకయ్య విజ్ఞన కేంద్రంలో సదస్సు
నెల్లూరు:జిల్లాలో దళిత పోలీసు అధికారులు ఉన్నప్పటికీ దళితులపై దాడులు జరగ డాన్ని నిరసిస్తూ సిపిఎం, కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయని, బాధితులకు అండగా నిలబడేందుకోసం ఈనెల 8వ తేదీన బుధవారం ఉదయం 11 గంటలకు దగదర్తి లోని కామ్రేడ్ జక్కా వెంకయ్య విజ్ఞానకేంద్రం లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. దగదర్తి మండలం లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలోని బాలాజీ నగర్ సిపిఎం ఆఫీసు నందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ వెంకమ రాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దగదర్తి మండలంలో దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని దళితులకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ, దళితులపైనే కౌంటర్ కేసులో పెట్టి వేధిస్తున్నారన్నారు. ఇటీవల ఉప్పలపాడు లో దళిత కౌలు రైతు తలారి రవి 2 ఎకరముల ను కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటే కౌలు చేస్తున్న భూమిలో 60 సెంట్లులో వేసిన వరి నాటును అదే గ్రామ కాపురస్తుడు పల్లాల వెంకయ్య అధికార పార్టీ నాయకుల అండతో తన ట్రాక్టర్ తో దున్నించి పంటను నాశనం చేశారన్నారు. ఈ దారుణంపై దగదర్తి మండలంలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా ఎస్‌ఐ తలారి రవి పైనే కౌంటర్ కేసు పెట్టి తీవ్రంగా కొట్టి వేధింపులకు గురి చేశారన్నారు. అలాగే ఉలవపాళ్ళ హైవే పెట్రోల్ బంకులో పనిచేస్తున్న గోచిపాతల తేజ పై బాడుగులపాడు ఎంపిటిసి సభ్యుడు, వై సిపి నాయకులు వెలినేని మహేష్ నాయుడు తన ట్రిప్పర్ కి రూ. 30 వేలకు డీజిల్ అప్పు పోయే లేదని తన అనుచరులతో వచ్చి కులం పేరుతో దూషించి, కిందపడేసి కాళ్లతో తన్ని, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడి లోను దగదర్తి ఎస్‌ఐ దాడి చేసిన వారికే అనుకూలంగా మాట్లాడి కేసును నీరుగార్చారన్నారు. చెన్నూరులో దళిత యువకుడు సోము మల్లికార్జున తన భార్యతో కలిసి పండుగ సామాను కోసం వెళ్లి భార్య పండుగ సామాను తీసుకుంటుండగా ప్రక్కకు వచ్చి మల్లికార్జున బీడీ తాగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన ఎస్‌ఐ నన్ను చూసి కూడా బీడీ కాలుస్తావా అంటూ దుర్భాషలాడుతూ మల్లికార్జున పై దాడి చేసి జీ పు ఎక్కించబోగా చుట్టు ప్రక్కల ఉన్న జనం ఆ చర్యలను అడ్డుకున్నారన్నారు. వెనుతిరిగిపోయే సమయంలో మల్లికార్జున వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కుని ఎస్‌ఐ వెళ్లి పోయాడన్నారు. ఇలా వరుసగా అమాయకులైన దళితులపై జరుగుతున్న దాడులు, పోలీసుల వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి దీనితో దళితులు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ సిపిఎం, కె.వి.పి.ఎస్., వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో దగదర్తిలో ఈ నెల 8వ తేదిన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో మండలంలోని ప్రజలు,దళిత సంఘాలు పాల్గొని సదస్సును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశా రు. ఈ మీడియా సమయంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం మోహన్ రావు , సిపిఎం కోవూరు మండల కార్యదర్శి గండవరపు శేషయ్య పాల్గొన్నారు.










