Mar 15,2023 21:56

ఫొటో : నిరసన చేపడుతున్న దళితులు

దళిత భూముల ఆక్రమణ అన్యాయం
ప్రజాశక్తి-బిట్రగుంట : ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను ఆక్రమించడం అన్యాయమని దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామం అరుంధతీయవాడలో ప్రభుత్వం దళిత కోసం ఇచ్చిన భూమి ఆక్రమణపై దళిత సంరక్షణ జిల్లా సమితి అధ్యక్షుడు ఎస్‌.మల్లి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన దళితులకు కేటాయించిన భూములను స్థానిక నాయకులు ఆక్రమణ చేయడం అన్యాయమని వారికి కేటాయించిన భూములను వారికే ఇచ్చేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో దాసు, రాంబాబు, వాసు, అంకమ్మ, కొండ బిట్రగుంట అరుంధతీయ వాసులు పాల్గొన్నారు.