హైదరాబాద్ : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బడా నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. గురువారం (జనవరి 29) ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫోటోను జూ.ఎన్టీ ఆర్ షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డియర్ జెన్నిఫర్ అంటూ ఆమె క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఆ లుక్ చూసిన అభిమానులు సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తవ్వగా...అక్టోబర్ 13న విడుదల చేయనన్నుట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.











