Jan 17,2023 18:22

కలెక్టర్‌ గిరీషకు పుష్పగుచ్చం ఇస్తున్న అహ్మద్‌ఖాన్‌

రాజంపేట సబ్‌ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌
ప్రజాశక్తి-రాయచోటి : రాజంపేట నూతన సబ్‌ కలెక్టర్‌గా మంగళవారం విధుల్లో చేరిన ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌ కలెక్టర్‌ గిరీషను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. చింటూరు ఐటిడిఎ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 2020 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌ రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విధితమే. అహ్మద్‌ఖాన్‌కు కలెక్టర్‌ గిరీష శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం డివిజన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. రాజంపేట డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తామని సబ్‌ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు.