Sep 27,2023 20:56

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు
డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ 116వ జయంతి
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని పలు డివిజన్లలలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ 116వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం స్థానిక 6,16,47 డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పి నరసింహా, ఎం.వి.రమణలు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రం కోసం అతి చిన్న వయసులో 23 సంవత్సరాలకే ఉరి కంబాన్ని ముద్దాడిన నాయకుడు భగత్‌ సింగ్‌ అన్నారు. బ్రిటిష్‌ వాళ్లు పరిపాలిస్తున్న భారతదేశంలో ప్రతి ఒక్కరికి విద్య ఉపాధి కావాలని పోరాటం చేసిన మహౌన్నతమైన వ్యక్తి భగత్‌ సింగ్‌ అన్నారు. అటువంటి మహనీయుల జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించి మతవాదులచరిత్రను, మూఢనమ్మకాలకు చెందిన అంశాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చి బోధించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. నేటి యువత భగత్‌ సింగ్‌ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని వారి జీవితాలకు బంగారు బాటలు వేసుకుంటూ దేశాభివృద్దికి తమ వంతు తోడ్పాటునందించాలన్నారు.
భగత్‌ సింగ్‌ అతి చిన్నవయసులో బ్రిటిష్‌ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసిన దేశ భక్తుడన్నారు. అటువంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా యువత పనిచేయాలని, దేశ అభివద్ధిలో యువత ముఖపాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు. మద్యపానానిక,ి మతోన్మాదానికి, డ్రగ్స్‌ కు, వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని సూచించారు. భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం వెంటనే భర్తీ చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. నగరంలో ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న రౌడీయిజానికి వ్యతిరేకంగా యువతను మంచి మార్గం వైపు నడిపించేలా ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకొని అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి ఏపీ జెన్కోను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ప్రభుత్వ నడిపించే విధంగా చర్యలు తీసుకొని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు జగదీష్‌ శేఖర్‌ రాయుడు కుమార్‌ వెంకటేష్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.