Sep 26,2023 21:02

పరిశీలిస్తున్న కమిషనర్‌

పరిశీలిస్తున్న కమిషనర్‌
డివైడర్ల మధ్య పచ్చదనాన్ని పరిరక్షించాలి
ప్రజాశక్తి-నెల్లూరు:నగర వ్యాప్తంగా రోడ్ల మధ్యలోని డివైడర్లలో పచ్చదనాన్ని ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక మద్రాసు బస్టాండ్‌, కె.వి.ఆర్‌ కూడలి, కరెంట్‌ ఆఫీస్‌ కూడలి ప్రాంతాల్లోని ఐ ల్యాండ్స్‌, డివైడర్లను అధికారులతో కలిసి కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. పర్యావరణానికి మేలు చేకూర్చే మొక్కలను ఎంపిక చేసుకుని నగర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. క్రమం తప్పకుండా నీటి సరఫరా ఉండేలా పరిరక్షించాలని కమిషనర్‌ సూచించారు.అనంతరం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో పునరావతం అయిన స్పందన ఫిర్యాదు పరిష్కారానికి అధికారులతో కలిసి సందర్శించారు. ఫిర్యాదు పునరావతం కాకుండా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం స్థానిక రెడ్‌ క్రాస్‌ సమీపంలోని గుఱ్ఱం జాషువా ప్రజా గ్రంధాలయంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్‌ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ సంపత్‌ కుమార్‌, ఉద్యాన శాఖ ఏ.డి ప్రదీప్‌, సిటీ ప్లానర్‌ దేవీ కుమారీ, అధికారులు,సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.