Jun 24,2022 23:27

మచిలీపట్నంలో టిడ్కో గృహాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా
  • కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి - మచిలిపట్నం అర్బన్‌
వచ్చే డిసెంబర్‌ నాటికి టిడ్కో గహాల నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. శుక్రవారం స్థానిక గోసంఘం సమీపంలోని టిడ్కో గహాలను శుక్రవారం ఆయన పరిశీలించి సంతప్తి వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని గోసంఘం, రుద్రవరం లేఅవుట్లు కలిసి 2,304 గహాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 300 చదరపు అడుగుల గృహాలు 1344, 365 చఅడుగుల గృహాలు 246, 430 చఅడుగుల గృహాలు 720 నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిలో 1536 గహాల నిర్మాణం పూర్తయిందని కలెక్టర్‌ చెప్పారు. అలాగే 672 గహాల నిర్మాణం చివరి దశలో ఉందని, 48 గహాల నిర్మాణం ఇంకా పైకప్పు వేయాల్సి ఉందని చెప్పారు. ఈ గహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.145.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటిలో ఇప్పటివరకు రూ.127 కోట్లు ఖర్చు చేశామన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు రూ.20.66 కోట్ల కేటాయించారన్నారు, వీటితో తాగునీటి వసతి, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌, అప్రోచ్‌ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే అంతర్గత రోడ్డు పనులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్‌ సదుపాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు కేటాయించిందని కలెక్టర్‌ చెప్పారు. దీని నిమిత్తం లబ్ధిదారులకు 40 శాతానికిపైగా బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు, మిగతా వారికి బెన్ఫిషయరీ కంట్రుబ్యూషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. రెండు నెలల్లో లబ్ధిదారులతో మాట్లాడి వారికి బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసేవిధంగా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బ్యాంకు రుణాలు మంజూరైన వారికి రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలన్నారు. గతంలో లబ్ధిదారులకు కేటాయించిన ఏ గృహమూ రద్దుకాదని చెప్పారు. టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్‌ బి.చిన్నోడు, బందరు ఆర్డీఓ ఐ.కిషోర్‌, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రయ్య, బందరు తహశీల్దారు డి.సునీల్‌ బాబు, ఎపిసిపిడిసిఎల్‌ ఇఇ సాంబశివరావు, సైట్‌ ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.