Jul 07,2021 13:45

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ .. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించే ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన అసలు పేరు యూసఫ్‌ ఖాన్‌ అని తెలిసిన విషయమే. అయితే మరి యూసఫ్‌ ఖాన్‌ కాస్తా.. దిలీప్‌కుమార్‌గా ఎలా మారింది, ఎవరు మార్చారు అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇది చదవండి.
యూసఫ్‌ఖాన్‌కు మొదటగా సినిమా ఛాన్స్‌ ఇచ్చింది నిర్మాత దేవికారాణి. ఆమె తెరకెక్కించిన 'జ్వర్‌ ఖాతా' సినిమా ద్వారానే ఆయనను చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం చేశారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే.. యూసఫ్‌ఖాన్‌గా ఉన్న అతని పేరును మార్చుకోమని ఆమె సలహా ఇచ్చారట. ఏ పేరుతో అయితే సినిమా ఇండిస్టీలోకి అడుగుపెడతారో.. అదే పేరు కొనసాగుతుందని.. తనకంటూ స్క్రీన్‌ నేమ్‌ ఉంటే బాగుందని అభిప్రాయపడి ఆవిడే పేరు మార్చుకోమని చెప్పారట. అతనికి దిలీప్‌కుమార్‌ అనే పేరును కూడా ఆవిడే సూచిచందట. ఇక ఆ పేరు కూడా తనకి సమ్మతం కావడం వల్ల.. యూసఫ్‌ఖాన్‌ కాస్తా.. దిలీప్‌కుమార్‌గా మారిపోయాడు.