Feb 08,2023 22:06

డిఇఒతో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

          మడకశిర రూరల్‌ : డిఇఒ వైఖరిపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈరేష్‌ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల వైఖరిపై వినతిపత్రం ఇవ్వటానికి వెళితే డిఇఒ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కనీసం వినతిపత్రం తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిందన్నారు. స్థానికజ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని కోరామన్నారు. అలాగే ప్రయివేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఈ విషయంలో డిఇఒ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 'సమస్యలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు.. చెప్పడానికి మీరెవరు,,' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. నియోజకవర్గంలో కొన్ని పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఈ విషయంపై డిఇఒ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. డీఈవో వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. సమస్యలు చెప్పడానికి వెళ్లిన నాయకులపై డిఇఒ అనుసరించిన వైఖరిని తాము ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు.