Sep 25,2023 19:37

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
డిగ్రీ సెకండ్‌, ఫోర్త్‌ సెమ్‌
సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలి
-ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ విజ్ఞప్తి
ప్రజాశక్తి-నెల్లూరు:డిగ్రీ సెకండ్‌, ఫోర్త్‌ సెమ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు వెల్లడించకుండా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్ధులు నష్టపోతారని, ఈ నేపథ్యంలో తక్షణమే ఫలితాలు విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో విక్రమ సింహపురి పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలకు ఫైనల్‌ ఇయర్‌ అక్టోబర్‌ 17 నుండి ఎగ్జామ్స్‌ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారని, దీనివలన విద్యార్థులు నష్టపోతారన్నారు.
డిగ్రీ లో సెకండ్‌ , ఫోర్త్‌, సేమ్‌ సప్లమెంటరీ ఎగ్జామ్స్‌ రిజల్ట్స్‌ ఇవ్వకుండానే డైరెక్ట్‌ గా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు సెమ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించడం వల్ల చాలామంది విద్యార్థులు ఏడాది పాటు పరీక్షలు రాసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు వెంటనే అక్టోబర్‌ 5 వరకు పరీక్ష తేదీని పొడిగించి పరీక్షలు అక్టోబర్‌ 17 తేదీ నుండి జరిగే పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. సెకండ్‌ సేమ్‌ ఫోర్త్‌ సెమ్‌ రాసిన విద్యార్థులకు రావాల్సిన రిజల్ట్స్‌ కూడా త్వరగా ఇవ్వాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నెల్లూరు నగర కార్యదర్శి వి,నరేంద్ర, సురేష్‌ ను పాల్గొన్నారు.