Jan 31,2023 21:15

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న డిఎల్‌డిఒ టి.రమణయ్య

డిఎల్‌డిఒ ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-ఉదయగిరి : సచివాలయ సిబ్బంది క్రమశిక్షణ కలిగి ఉండాలని ఆత్మకూరు డిఎల్‌డిఒ టి.రమణయ్య పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొండాయపాలెం తిరుములపురం సచివాలయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది 100 శాతం బయోమెట్రిక్‌ 10:30గంటల లోపు వేయాలన్నారు.
కార్యాలయంలో అందించే సర్వీసులపై దృష్టి పెట్టాలని క్రమశిక్షణ ముఖ్యంగా అవసరమని హెచ్చరించారు. అనంతరం తిరుమలపురం సచివాలయంలో సిబ్బంది నూతన భవనంలో చేరికపై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సచివాలయం బాడుగపై సర్పంచ్‌తో చర్చించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్‌ రెడ్డి, మండల కో-ఆర్డినేటర్‌ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.