కేంద్ర మంత్రితో జాతీయ అవారు అందుకుంటున్న పురం విద్యార్థిని ముస్కాన్
ప్రజాశక్తి-హిందూపురం హిందూపురం బాలికల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని మహమ్మద్ ముస్కాన్‌బాను డి-ఫార్మసీలో 1100/1053 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. దీంతో శుక్రవారం మహారాష్ట్రలోని నాగపూర్‌లోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ బానుకు కేకే జార్జ్ మెమోరియల్ జాతీయ అవార్డు అందించి అభినందించారు. సాధారణ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్వసించి, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం రావాడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థిని ముస్కాన్ బాను తెలిపింది.










