Mar 28,2022 11:18

విజయవాడ : ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్‌ తీవ్రతరం చేసిన కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ... కార్మిక, ఉద్యోగ, ప్రజా, వామపక్ష సంఘాలు కదంతొక్కాయి. నేడు, రేపు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా... సోమవారం విజయవాడ వన్‌టౌన్‌ రథం సెంటర్‌ నుండి బీసెంట్‌ రోడ్డు లెనిన్‌ సెంటర్‌ వరకూ వివిధ కార్మిక, ప్రజా సంఘాలు భారీ ఎత్తున మహా ప్రదర్శన చేపట్టాయి. విజయవాడ రోడ్లన్నీ ఎర్రజెండాలతో నిండిపోయాయి. దారిపోడవునా కార్మికులకు స్థానిక ప్రజలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ... ' దేశాన్ని, ప్రజల్ని కాపాడుకుందాం ' అంటూ కార్మికులంతా గళమెత్తారు. అనంతరం లెనిన్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. సభ ప్రారంభం కాగానే దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా... ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీ‌నివాసరావు, సిఐటియు జనరల్ సెక్రటరీ గఫూర్,  ఇతర నేతలు.

 

దేశవ్యాప్త సమ్మె.. విజయవాడలో కార్మిక మహాప్రదర్శన


 

Nationwide strike .. Labor demonstration in Vijayawada