అనంతపురం : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 2 వ రోజు మంగళవారం ధర్మవరం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిఐటియు, మునిసిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆటో యూనియన్, మీటర్ రీడర్స్, పెయింటర్స్, తదితరులు భారీ సంఖ్యలో నినాదాలతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక కాలేజీ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం పై నిరసన తెలిపారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రైల్వే డిఆర్‌ఎం ఆఫీస్ నుంచి ఆసిల్ మెట్ట వరకు అఖిలపక్ష కార్మిక ర్యాలీ సంఘాలు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు















