ప్రజాశక్తి-భీమవరం : మార్చి 28,29 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. శనివారం నాడు సివిల్ సప్లై హమాలీ కార్మికులు జనరల్ బాడిసమావేశం ఎస్ డబ్ల్యూ సి గొదాములవద్ధ జరిగింది ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం గోదాములు ప్రైవేటు వ్యక్తులకు అప్ప చెబుతున్నారని వీటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు మార్పు చేస్తూ పని గంటలు పెంచి కార్మికుల పై భారాలు మోపుతున్నారని విమర్శించారు. బడా బడా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ప్రకటిస్తూ కార్మికులు ప్రజలు పేదలపై విపరీతమైనభారాలు పెంచారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, వాటిని అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు.పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడినడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడిదారులకుదోచి పెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార, ప్రతిపక్ష పార్టీలు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు ప్రభుత్వం రంగాన్ని ప్రజల సంపదను కాపాడుకోవడం కోసం ప్రజలు కార్మికుల హక్కులు నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న సమ్మెలో ప్రజలు పెద్ద ఎత్తున బలపరచి కార్మికులు పాల్గొని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, సివిల్ సప్లై హమాలి జిల్లా నాయకులు సామంతులు ఉదయభాస్కర్, కంకణాల రంగారావు, బోర్ సింగ్, భాస్కరరావు, శ్రీను, వెంకట రావు, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.










