Apr 16,2023 21:32

వివిపాలెంలో మాట్లాడుతున్న రమణయ్య

ప్రజాశక్తి-వలేటివారిపాలెం :భారతదేశాన్ని మతోన్మాదుల భారి నుండి కాపాడుకునేందుకు లౌకిక పార్టీలు, వామపక్షాలు, దళిత, ప్రజాస్వామికవాదులంతా ఏకం కావాలని సిపిbం వివిపాలెం మండల కార్యదర్శి మాదాల రమణయ్య పిలుపునిచ్చారు. 'మోడీని సాగనంపుదాం-భారతదేశాన్ని రక్షించుకుందాం' అని సిపిఐ, సిపిbం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 30వ తేది వరకు ప్రచారభేరి జీబుజాత ప్రారంభించారు. మండల కేంద్రమైన వలేటివారిపాలెంకు ఆదివారం సాయంత్రం చేరుకుంది. బస్టాండ్‌ సెంటరులో జాతానుద్దేశించి సిపిఐ, సిపిbం కందుకూరు నియోజకవర్గ నాయకులు బూసి సురేష్‌, జివిబి కుమార్‌, కెవిపిbస్‌ జిల్లా కమిటి సభ్యులు గుండ్లతోటి మాధవమూర్తి, రాళ్ళపాడు పరిరక్షణ రైతుకూలి సంఘం కార్యదర్శి మిట్టనోసల సుబాను తదితరులు మాట్లాడారు. దేశంలో అవినీతి పెరుగుతుంది, మేము అంతమొరదిస్తామని గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం bనిమిదేళ్లలో దేశాన్ని అనివిధాలా దివాలా తీయించినట్లు పేర్కొన్నారు. జాతా బడేవారిపాలెం, పోకూరు, అంకభూపాలపురం తదితర గ్రామాల్లో పర్యటించింది. జాతాలో సిపిbం మండల నాయకులు పర్రె భాస్కరరావు, మంగి లాజరు, మంగి జక్రయ్య, పి శివ, సిఐటియు నాయకులు కె నాగూర్‌, సిపిఐ నాయకులు మురళీకృష్ణ, కె రామమూర్తి, పిన్నిక అంజయ్య, మర్రి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.