Nov 17,2023 20:52

డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన ఆయన అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెడితే తాను నియోజకవర్గ ప్రజల కోసం మెగా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. మెడికల్‌ క్యాంపు నిర్వహణకు జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి యాజమాన్యం పూర్తి ఆధునిక సదుపాయాలతో కూడిన రెండు మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను, డాక్టర్లను, సిబ్బందిని పంపించి ఎంతో సహకారం అందించిందన్నారు.కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అనపర్తి శామ్యూల్‌, ఎఎంసి ఛైర్మన్‌ ముప్పిడి సంపత్‌ కుమార్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ గుండుబోగుల నాగు, వన్‌ టౌన్‌, టూ టౌన్‌ జెసి ఎస్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.