దాతలకు సన్మానం
ప్రజాశక్తి-ఉదయగిరి : దూరప్రాంత విద్యార్థులకు వాహనం ఏర్పాటు చేసిన దాతలకు అప్పసముద్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు బుధవారం వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం జులై -2022 నుండి గ్రామ దాతలు చేజర్ల జయరామిరెడ్డి, మోడీ రామాంజనేయులు, బండారు.తిరుపతిరావు, పల్లక వెంకట సుబ్బారెడ్డి, ఈర్ల.రవి పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నెలవారీ బాడుగకు ప్రయాణ వసతి కల్పించి ఉన్నారు. ఈ మధ్య కాలంలో స్థానిక మాజీ మండలాధ్యక్షులు చేజర్ల సుబ్బారెడ్డి మన పౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, వడ్లమూడి పల్లి వాస్తవ్యులు ఎన్‌ఆర్‌ఐ కొండారెడ్డి పాఠశాల పూర్వవిద్యార్థి ఎన్‌ఆర్‌ఐ నల్లబోతుల సురేష్ దాతృత్వంతో పాఠశాలకు స్వంత వాహనాన్ని సమకూర్చు కోవడం జరిగిందన్నారు. దానితో వాహనాన్ని వారి చేతుల మీదుగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ చేజర్ల సుధాకర్ రెడ్డి అందజేశారన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి మోడి రామాంజనేయులు, విశ్రాంత ప్రధానాచార్యులు దారపనేని చిన్న వెంగయ్య, పంచాయతీ ఉప సర్పంచ్. సిహెచ్.చిన్నయ్య, యుటిఎఫ్ నాయకులు ఈ.తిరుపతయ్య, కె.చంద్ర శేఖర్ రెడ్డి, షేక్ రంతుజాని, బి శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, నాయబ్, దుర్గా ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.










