ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మండలంలోని విజయనగ్ కాలనీ చిక్కులగుట్టలో దారి సమస్య పరిస్కరించాలని మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్ ప్రమీల, వర్క్స్ బోర్డ్ చైర్మన్ ఎస్.ఏ.కరీముల్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్ని కులాలు వారు గత 50 ఏళ్ల నుండి కలిసిమెలసి జీవిస్తున్నారని, కాలనీ నుండి రోజువారి కూలీలకు పోవాలన్న, తాగునీరు తీసుకొనిరావాలన్న, పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నవారికి ఒకే ఒక మార్గం నామకట్ట దారని పేర్కొన్నారు. వీరి పూర్వికులు రాకా పోకాలు ప్రస్తుతం సమాజ్ కట్ట నిర్మించక ముందు నుండి ఈ మార్గం గూండా రాకపోకలు జరుగుతున్నవన్నారు. గత పదిరోజులుగా సమాజ్ కట్టలో మద్రాసు స్కూలు వున్నదని, సమాజ్ రిపేరిలో వున్నదని కొన్ని రోజులు తరువాత యాథప్రకారం మీకు అన్ని సౌకర్యాలు కల్పింస్తామని కొంత మంది నమాజ్ కట్ట పెద్దమనుషులు తెలియచేసారన్నారు. 10 రోజులు కావస్తున్నా రోడ్డు మార్గంలో సమాజ్ కట్ట ఇరువైపులా గేటుకి బిగాలు వేసారని, రోజువారి దినచర్య కార్యకలపాలు అన్ని చాలా ఇబందిగా ఉన్నాయన్నారు. కాలనీ సమస్యను పరిష్కారించి శ్వతంగా సమాజ్ కట్ట గుండా రోడ్డు మార్గం కల్పించి 10 అడుగులు రోడ్డు మార్గం శాశ్వతంగా కల్పించాలని తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు రమేష్, జయపాల్, శశికళ, రాధ, ఆదినారాయణ పాల్గొన్నారు.










