డాక్టర్ షకీలా జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బిఎస్‌ఆర్ హాస్పిటల్ అదినేత్రి డాక్టర్ షకీలా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని జమ్మలపాలెం గిరిజన కాలనీలో డాక్టర్ షకీలా జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు స్వయంగా ఆమె పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు విశేష వైద్య సేవలు అందిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తూ స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలకు చేయూతనిచ్చారు. డాక్టర్ షకీలా మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడంలో ముందుంటానని, అనేక మంది పేదలకు వైద్య సేవలు అందిస్తూ వాటికి అండగా ఉంటున్నానన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్, ఉపాధ్యాయులు హరికృష్ణ, ఖాజా రసూల్, స్రెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వాగాల శ్రీహరి, ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, ప్రజా గాయకుడు గద్దర్ బాబు తదితరులున్నారు.










