డాక్టర్ సాయి చరణ్‌ను సన్మానిస్తున్న కరాటే మాస్టర్
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎన్.సాయిచరణ్‌ను కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఆర్.సురేష్ పూలమాల దుస్సాలవతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిచరణ్ డాక్టర్ పట్టా సాధించడం ఆనందించదగ్గ విషయమన్నారు. యువత, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డాక్టర్ సాయిచరణ్ మాట్లాడుతూ అందరికీ వైద్య సేవలు అందించి మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి మంచి పేరు తెస్తానని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పాల రవికుమార్, డాక్టర్ రాధిక, యూత్ కరాటే క్లబ్ కార్యదర్శి, చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.మని సాయి, కరాటే మాస్టర్లు టి.మహేశ్వర్, షేక్ విశ్వా, జోషితరెడ్డి పాల్గొన్నారు.










