May 03,2023 20:35

నివాళులర్పిస్తున్న ఆవాజ్‌ నాయకులు

నివాళులర్పిస్తున్న ఆవాజ్‌ నాయకులు
డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ కు ఘన నివాళి
నెల్లూరు:భారత రత్న డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ 54వ వర్థంతి కార్యక్రమం ఆవాజ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ గారు స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న ప్రముఖులలో ఒకరన్నారు. భారత దేశంలో ఉన్నత విలువలతో ఉన్న భారత మూడవ భారత రాష్ట్రపతిగా చేసిన సేవలకు ఆయనకి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదు పోందిన వ్యక్తి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ అని తెలిపారు. నేడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశంలో మతం పేరిట ప్రజల మద్య చీలికలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కానీ స్వతంత్ర అనంతరం మత సామరస్యం, లౌకిక విలువలు కాపాడేందుకు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఎంతో పరితపించారనే తెలిపారు.
నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కొంతమంది రాజకీయ ప్రముఖుల స్వాతంత్ర సమరయోధుల చరిత్రను పాఠాలను పాఠ్యపుస్తకాలు నుంచి తొలగించడం చాలా సిగ్గుచేటన్నారు. జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం గాని, ప్రజాప్రతినిధులుగాని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ జయంతిని, వర్ధంతిని జరపకుండా వదిలేయడం చాలా బాధించాల్సిన విషయం అన్నారు. రాబోయే రోజుల్లో నైనా జిల్లా అధికారులు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ రియాజ్‌, షేక్‌ చాన్‌ బాషా, సయ్యద్‌ అన్సర్‌, పి. షబ్బీర్‌ 53వ డివిజన్‌ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు 54వ డివిజన్‌ శాఖ కార్యదర్శి షేక్‌ జాఫర్‌ ఆవాజ్‌ సభ్యులు షేక్‌ ఉస్మాన్‌, షేక్‌ అమాన్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు