కదిరి టౌన్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తాల హరిప్రసాద్ ఇంటి వద్ద ఆదివారం నాడు అభిమానుల కోలాహలం నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా బత్తల శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తన నివాసం వద్ద వందలాదిగా విచ్చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, సాలువాతో సత్కరించారు. వైసిపి రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ప్రభుత్వ పబ్లిక్ కమిషన్ మెంబర్, వైసిపి సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బత్తల హరిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందన్నారు. ప్రజలందరికీ సంక్షేమయ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర లీగల్ అడ్వైజర్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బహుద్దీన్ పాల్గొన్నారు.










