ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : నగరంలో ఐటిఐ కాలేజీ ఎల్‌ఐసి కాలనీ నెల్సన్ మండెలా పార్కు ఎదు రుగా వైఎన్నాఆర్ ఛారిటీస్ అధినేత యల మంచిలి జయప్రకాశ్, అరుణ దంపతులు నూత నంగా ఏర్పాటు చేసిన దా అల్లి కాఫీ అండ్ రెస్టారెంట్‌ను ఆంధ్ర హాస్పటల్ ఎమ్‌డి రమణమూర్తి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసిపి సీనియర్ నాయకులు కడియాల బుజ్జిబాబు, మాజీ డిప్యూటి మేయర్ అళ్లా చెల్లారావు పలువురు ప్రముఖులు కలిసి రెస్టారెంటును లాంఛనంగా ప్రారంభించారు. సేవా, రాజకీయా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన యలమంచిలి జయప్రకాశ్ నూతన రెస్టారెంట్ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు. రుచికరమైన కాఫీ, బిర్యానీ, చైనీస్, తందూరి లాంటి వెరైటీ వంటకాలు భుజించి చక్కటి అనుభూతిని పొందేలా రెస్టారెంట్ వైఎన్నాఆర్ ఛారిటిస్ అధినేత అల్లి రెస్టారెంట్ యాజమాని యలమంచిలి జయప్రకాశ్ తెలిపారు.










