Oct 14,2023 13:38

ప్రజాశక్తి-విజయవాడ : చంద్రబాబు ఆరోగ్యంపై నిపుణులైన వైద్య బృందాన్ని నియమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పై మీడియాలో వస్తున్న వార్తలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం విజయవాడ గవర్నర్ పేటలో జరిగిన సిపిఎం విజయవాడ ప్రజా పోరుబాట ముగింపు సభ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిపుణులైన వైద్యబృందాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఆస్పత్రికి తరలించి తక్షణం వైద్య సహాయం అందించాలని కోరారు.