- బిజేపీ, వైసిపి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని ద్రోహం
- ఉపాధి కల్పనలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శం
- నిరుద్యోగ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
- ఏక గ్రీవంగా 19 తీర్మాణాలకు ఆమోదం
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : కేంద్రంలోని బిజేపీ, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన హెూటల్ రివర్భేలో బుధవారం నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సదస్సుకు వి.శ్రీనివాసరావు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు, యువతలో నైపుణ్య అభివృద్ధి, ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీలతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనా ్నరు. కేంద్రలోని బిజేపీ, రాష్ట్రంలోని వైసిపి పూర్తి భిన్నమైన విధానాలను అనుసరిస్తున్న ఫలితంగానే నిరుదో రోగ సమస్య నానాటికి పెరుగుతోందని వివరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా బుట్టదాఖలు చేశాయన్నారు. పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన రాష్ట్రానికి ప్రత్యేక హెూదాను సాధించుకోవటంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. చిజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్ర చేస్తోందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఒక ఉదాహరణగా వివరించారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనంతరం 60 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయం టూ చేసిన ప్రచారాన్ని గుర్తు చేశారు. ఏడు నెలలు గడుస్తున్నా పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు ఎందుకు పడటంలేదని ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు, సెజ్లు అంటూ రైతుల నుంచి సేకరించిన భూములన తాకట్టు పెట్టుకుని కార్పొరేట్ సంస్థల యజమానులు బ్యాంకుల ద్వారా లబ్ధి పొంది ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని అన్నారు. అటువంటి అవినీతి పరులకు కేంద్రం ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని వివరించారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగం రాష్ట్రంలో ఉందని ఈ పరిస్థితులలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెం. 1. అంటూ ప్రచార ఆర్భాటాలు చేసుకోవటం సిగ్గుచేటన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పెంపుతో యువతకు కొద్దిపాటి ఉపాధి కల్పిస్తున్న చిరుపరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని తెలిపారు. ఆర్ధిక సంక్షోభంతో భారీ పరిశ్రమలు సైతం ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టభద్రులు దిక్కుతోచని స్థితిలో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్చడుతున్నారని వివరించారు. ఉపాధి కల్పనలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికే ఆదర్శమని వివరించారు. చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుందని. అన్నారు. ఎంఎల్ సి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిం చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 30 వేల పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం గ్రంధాలయ వ్యవస్థను మరింత పటిష్టతరం చేయాలని కోరారు. అంబేద్కర్ స్టడీసర్కిల్ను అభివృద్ధి చేయటంతో పాటు ప్రతి జిల్లాకు జ్యోతిరావు పూలే స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు. నియోజక వర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోం —రు. ఉపాధ్యాయ ఎంఎల్సి ఐవి మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్న బిజేపీ ప్రభుత్వానికి లోక్సభ, రాజ్యసభలలో వైసిపి ప్రభుత్వం బల్లగుద్ది మరీ సపోర్టు చేస్తోందని వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా రాజకీయ అస్త్రంగా మార్చుతున్న పాలక ప్రభుత్వాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. యువజన పోరాటాలకు పిడిఎఫ్ ఎంఎల్సీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో చివరిగా డివైఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న 19 తీర్మాణాలను ప్రవేశ పెట్టగా సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఉమామహేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు హరికిషోర్, డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై. రాము, ఎస్ ఎఫ్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, అధ్యక్షులు ప్రసన్న, శ్రామిక మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి, ఎం, నాగమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, యువజన సంఘం నాయకులు బి.పవన్, డాక్టర్ చైతన్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- తీర్మానాలు
1) మెగా డీఎస్సీ ప్రకటించి 40 వేల ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు పిఈటీలతో కలిపి భర్తీ చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి.
2) కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9.64లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టులను భర్తీచేయాలి.
3) ఆంధ్రప్రదేశ్ నూతన యూత్ పాలసీని ప్రకటించాలి.
4) 5వేల పోస్టులతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.
5) రాష్ట్రంలో ఐ.టి., సినీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి జి. వోను అమలు చేయాలి.
6) పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి క్రీడా రంగంలో శాశ్వత ప్రాతిపదికన కోర్ట్లను నియమించాలి. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేయాలి.
7) పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ (ఎహెచ్ఎఎ) ఏం, ఏజం, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలి.
(B) గ్రంధాలయాలలో ఈ-లైబ్రరీలను (డిజిటల్) ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించాలి.
9) ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి.
(10) ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి..
11) కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సహా అన్ని రకాల ప్రభుత్వ నియామకాలలో, ప్రయివేటు రంగంలోను రిజర్వేషన్లు అమలు చేయాలి...
12) ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలి. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి అభివృద్ధి చేయాలి. కడప ఉక్కును ప్రారంభించాలి.
13) పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోలీసు కానిస్టేబుల్, ఎస్సై, ఫైర్, జైలు వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలి.
14) ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి.
15) టిటిడిలో ఖాళీగా ఉన్న 9500 పోస్టులను భర్తీ చేయాలి.
16)పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు స్టడీ సర్కిల్స్ వసతి, స్టెఫండ్స్ ఏర్పాటు చేయాలి.
17) రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చేవరకు వారికి పుస్తకాలు పరీక్ష రుసుము వగైరా వంటి ఖర్చులకు నెలకు 5వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలి
18) చదువుకోడానికి ఎంత ఖర్చవుతుందో అంతకు రెండు నింతులు కోచింగ్ లకు ఖర్చు అవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వాలి
19) గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం బ్యాంకు తో సంబంధం లేకుండా అర్హత కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి










